IOCL Recruitment 2026: ఇండియన్ ఆయిల్‌లో 335 అప్రెంటిస్ పోస్టులు.. 10th, ITI, డిప్లొమా, డిగ్రీతో అవకాశం
IOCL Recruitment 2026: ఇండియన్ ఆయిల్‌లో 335 అప్రెంటిస్ పోస్టులు.. 10th, ITI, డిప్లొమా, డిగ్రీతో అవకాశం
IOCL Recruitment 2026 335 Apprentice Posts : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో అప్రెంటిస్ శిక్షణకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వెస్ట్రన్ రీజియన్ పరిధిలో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాల్లో మొత్తం 335 అవకాశాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు : పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు 10వ తరగతితో పాటు సంబంధిత రెండేళ్ల ITI అర్హత అవసరం. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు BA, B.Com, B.Sc లేదా BBA వంటి డిగ్రీలు ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 12వ తరగతి అర్హత కోరుతున్నారు. అర్హతలు సంబంధిత విభాగంలో పూర్తి కాల రెగ్యులర్ కోర్సు ద్వారా పొందినవై ఉండాలి. పార్ట్‌టైమ్, కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ విధానంలో పొందిన అర్హతలను ఈ నోటిఫికేషన్‌లో అంగీకరించరు.

వయసు : 2026 సెప్టెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 24 సంవత్సరాలు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC-NCL అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం : ఈ అప్రెంటిస్ పోస్టులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. మెరిట్‌లో ఎంపికైనవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలిచి, అనంతరం ప్రీ-ఎంగేజ్‌మెంట్ మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు.
అప్రెంటిస్ శిక్షణ కాలం : ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ శిక్షణ కాలం 12 నెలలు. శిక్షణ సమయంలో చెల్లించే స్టైపెండ్ సంబంధిత Apprenticeship Rules ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు తేదీలు : ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 5న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 4, 2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు పూర్తి చేయాలి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు NAPS పోర్టల్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు NATS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ఒకే డిసిప్లిన్ కోడ్‌కు మాత్రమే అప్లై చేయాలని IOCL స్పష్టం చేసింది.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
