10+2 అర్హతతో భారత సుప్రీం కోర్ట్ లో Jr కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest Supreme Court Of India Job Recruitment 2026 Apply Now
10+2 అర్హతతో భారత సుప్రీం కోర్ట్ లో Jr కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest Supreme Court Of India Job Recruitment 2026 Apply Now
Latest Supreme Court Of India Recruitment 2026 Latest Junior Court Attendant Job Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సుప్రీం కోర్ట్ నుండి తాత్కాలిక ఉద్యోగ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వివిధ జూనియర్ కోర్ట్ అటెండెంట్ (గ్రూప్ ‘సి’ నాన్-క్లరికల్ పోస్ట్) పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 25 నవంబర్ 2026 లోపల https://www.sci.gov.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక సుప్రీం కోర్ట్ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ జూనియర్ కోర్ట్ అటెండెంట్ .. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ (SSC) లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత, 10+2 అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 27 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.sci.gov.in/ లో ఆన్లైన్ లో 25 నవంబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సుప్రీం కోర్ట్ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹జూనియర్ కోర్ట్ అటెండెంట్
మొత్తం 130 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹 జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులకు : ప్రభుత్వం గుర్తించిన ఏదైనా బోర్డు/సంస్థ నిర్వహించే కనీసం పదవ తరగతి పరీక్ష. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు/సంస్థ నిర్వహించే గరిష్టంగా 12వ తరగతి/10+2 పరీక్ష లో పాస్ ఐ ఉండాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 27 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులకు నెల జీతం రూ.21,700/- to రూ.69,100/- వరకు చెల్లిస్తారు.
🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
* జనరల్/అన్రిజర్వ్డ్ అభ్యర్థులు : రూ.1500/-
* ఓబీసీ (ఎన్సీఎల్)/ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు : రూ.750/-
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ : 25 నవంబర్ 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:
* ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
* ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ తాత్కాలికంగా 2026 డిసెంబర్ 26వ తేదీన నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూ తేదీని సుప్రీం కోర్టు వెబ్సైట్, అనగా www.sci.gov.in లో తెలియజేయడం జరుగుతుంది. అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్‌కు SMS మరియు ఇ-మెయిల్ ద్వారా కూడా సమాచారం పంపబడుతుంది.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25 నవంబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: https://www.sci.gov.in/
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

