VRO Jobs : రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పాలన అధికారుల (జీపీఓ) పోస్టుల భర్తీ
VRO Jobs : రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పాలన అధికారుల (జీపీఓ) పోస్టుల భర్తీ
TS Revenue department GPO Notification Soon : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పాలన అధికారుల (జీపీఓ) పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాలకు ప్రతి గ్రామానికో అధికారిని నియమించడమే లక్ష్యంగా ఉన్నాయి.

గతంలో వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థలను రద్దు చేసి, సంబంధిత సిబ్బందిని ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు. ప్రస్తుత నిర్ణయంతో, ఈ మాజీ వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి ఆసక్తి ఉన్నవారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులను గుర్తించి నియామక ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నియామకాలు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవహారాల నిర్వహణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
