Assam Rifles Recruitment 2026: 354 పోస్టులకు భారీ రిక్రూట్మెంట్.. 10వ తరగతి, ITI అర్హతతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
Assam Rifles Recruitment 2026: 354 పోస్టులకు భారీ రిక్రూట్మెంట్.. 10వ తరగతి, ITI అర్హతతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
Assam Rifles Recruitment 2026 : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అస్సాం రైఫిల్స్ నుంచి మంచి అవకాశం వచ్చింది. అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మ్యాన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026 ద్వారా వివిధ గ్రూప్-C పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 354 ఖాళీలు ఉన్నాయి.ఈ పోస్టులకు అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి మాత్రమే ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. రిక్రూట్మెంట్ ర్యాలీని తాత్కాలికంగా 2026 నవంబర్ 23 నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
354 గ్రూప్-C పోస్టులు : అస్సాం రైఫిల్స్ రిక్రూట్మెంట్లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాలకు చెందిన పలు పోస్టులు ఉన్నాయి. వీటిలో రైఫిల్‌మ్యాన్ (ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్), రైఫిల్‌మ్యాన్ (లైన్‌మ్యాన్ ఫీల్డ్), రైఫిల్‌మ్యాన్ (ఆర్మరర్), రైఫిల్‌మ్యాన్ (ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్), రైఫిల్‌మ్యాన్ (రికవరీ వెహికల్ మెకానిక్), రైఫిల్‌మ్యాన్ (ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్), హవిల్దార్ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్), రైఫిల్‌మ్యాన్ (మెటల్స్మిత్), రైఫిల్‌మ్యాన్ (అప్హోల్స్టర్), రైఫిల్‌మ్యాన్ (వెహికల్ మెకానిక్), రైఫిల్‌మ్యాన్ (వెల్డర్), వారెంట్ ఆఫీసర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్), వారెంట్ ఆఫీసర్ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్), వారెంట్ ఆఫీసర్ (ఫిజియోథెరపిస్ట్), రైఫిల్‌మ్యాన్ (మేసన్) తదితర ట్రేడ్లు ఉన్నాయి.

ముఖ్యమైన వివరాలు ఒకసారి చూస్తే
సంస్థ: Assam Rifles
రిక్రూట్మెంట్: Technical & Tradesman Recruitment Rally 2026
మొత్తం ఖాళీలు: 354
పోస్టులు: Group-C Technical & Tradesman పోస్టులు
అర్హత: పోస్టును బట్టి 10వ తరగతి + ITI/టెక్నికల్ అర్హత
వయసు: సాధారణంగా 18–23 సంవత్సరాలు
వయస్సు కటాఫ్: 01-07-2026
దరఖాస్తు ప్రారంభం: 28-09-2026
చివరి తేదీ: 28-10-2026, రాత్రి 11:59 గంటల వరకు
ర్యాలీ ప్రారంభం: 23-11-2026 నుంచి
ఫీజు: రూ.100
SC/ST/Ex-Servicemen: ఫీజు మినహాయింపు
దరఖాస్తు విధానం: Online
PST/PET కేంద్రాలు: జోర్హాట్/దిఫు, అస్సాం
అధికారిక వెబ్సైట్: www.assamrifles.gov.in
ముఖ్యమైన తేదీలు : అస్సాం రైఫిల్స్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 అక్టోబర్ 28 రాత్రి 11:59 గంటలలోపు సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. రిక్రూట్మెంట్ ర్యాలీని 2026 నవంబర్ 23 నుంచి తాత్కాలికంగా నిర్వహించనున్నారు.
విద్యార్హత : పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. కొన్ని ట్రేడ్లకు 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు ITI లేదా సంబంధిత సాంకేతిక శిక్షణ అవసరం. ఉదాహరణకు ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ITIలో కనీసం రెండేళ్ల సాంకేతిక శిక్షణ లేదా సంబంధిత ఇంజినీరింగ్/టెక్నికల్ డిప్లొమా అర్హతగా పేర్కొన్నారు.
లైన్‌మ్యాన్ ఫీల్డ్ పోస్టుకు కూడా 10వ తరగతితో పాటు సంబంధిత ITI శిక్షణ లేదా సంబంధిత టెక్నికల్ డిప్లొమా అవసరం.
ఆర్మరర్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు వెల్డింగ్ ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్ అవసరం. రికవరీ వెహికల్ మెకానిక్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ITI అర్హత మరియు చెల్లుబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్/ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమయ్యే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న ట్రేడ్‌కు సంబంధించిన పూర్తి విద్యార్హతను అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి.
వయోపరిమితి : చాలా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
వయస్సును లెక్కించడానికి 2026 జూలై 1ను కటాఫ్ తేదీగా పరిగణిస్తారు. అభ్యర్థుల పుట్టిన తేదీ, పేరు నిర్ధారణకు మెట్రిక్యులేషన్/సెకండరీ పరీక్ష సర్టిఫికేట్లో నమోదైన వివరాలనే పరిగణనలోకి తీసుకుంటారు.
రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు కూడా నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది.
ఫిజికల్ టెస్ట్ తప్పనిసరి : అస్సాం రైఫిల్స్ రిక్రూట్మెంట్లో శారీరక ప్రమాణ పరీక్ష PST, శారీరక సామర్థ్య పరీక్ష PET కీలక దశలు. RFID ఆధారిత PST/PETను జోర్హాట్ లేదా దిఫు, అస్సాం కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత పరీక్షకు సంబంధించిన రిపోర్టింగ్ తేదీని అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు.
సాధారణంగా పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 170 సెం.మీ. గా పేర్కొన్నారు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు, వర్గాలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఎత్తులో సడలింపు ఉంటుంది. అలాంటి అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : గ్రూప్-C పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.100గా ఉంది. అయితే SC, ST మరియు మాజీ సైనికుల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంది. ఫీజును నిర్దేశించిన విధంగా ఆన్లైన్లో లేదా SBI ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపు చేసిన తర్వాత చలాన్/రసీదు కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. PST/PETకు హాజరయ్యే సమయంలో అసలు చెల్లింపు రసీదు/చలాన్‌ను కూడా తీసుకెళ్లాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు అస్సాం రైఫిల్స్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి Online Application ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ, నివాస వివరాలు తదితర సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. అవసరమైన సర్టిఫికెట్లను నోటిఫికేషన్లో సూచించిన విధంగా అప్లోడ్ చేయాలి. చివరి తేదీ అక్టోబర్ 28, 2026 రాత్రి 11:59 గంటలు గడువు తర్వాత దరఖాస్తులను స్వీకరించరు.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
