టెన్త్ నుంచి బీటెక్ వరకు అర్హత తో విద్యుత్ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాల | CPRI Notification 2026
టెన్త్ నుంచి బీటెక్ వరకు అర్హత తో విద్యుత్ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాల | CPRI Notification 2026
CPRI Recruitment 2026 110 Government Jobs : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI) దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నియామకంలో టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్-I, అసిస్టెంట్ గ్రేడ్-II, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ గ్రేడ్-I తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. టెన్త్, డిప్లొమా, బీటెక్ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు సంబంధిత పని అనుభవం కూడా అవసరం.

ముఖ్యమైన వివరాలు ఒకసారి చూస్తే
సంస్థ: సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI)
రిక్రూట్మెంట్: కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 110
పోస్టులు: టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్-I, అసిస్టెంట్ గ్రేడ్-II, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ గ్రేడ్-I పోస్టులు
అర్హత: పోస్టులను బట్టి టెన్త్, డిప్లొమా, బీటెక్ డిగ్రీ, ఉద్యోగానుభవం ఉండాలి
వయసు: సాధారణంగా 18–35 సంవత్సరాలు
చివరి తేదీ: 12-10-2026
ఫీజు: రూ.700/- to రూ.1000/-
SC/ST/Ex-Servicemen: ఫీజు మినహాయింపు
దరఖాస్తు విధానం: Online
అధికారిక వెబ్సైట్: https://cpri.res.in/
అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించిన వయో సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నారు. పోస్టును బట్టి ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్ కూడా ఉండవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. జీతం కూడా పోస్టును బట్టి మారుతుంది. నెలకు సుమారు ₹18,000 నుంచి ₹1,42,400 వరకు పే స్కేల్ ఉంటుంది. సంబంధిత పోస్టుకు వర్తించే ఇతర ప్రభుత్వ అలవెన్సులు, ప్రయోజనాలు నిబంధనల ప్రకారం లభిస్తాయి.
అర్హతలు ఉన్న అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది. 2026 అక్టోబర్ 12 దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో పోస్టుల వారీగా విద్యార్హతలు, వయసు, ఫీజు, ఎంపిక విధానం తదితర వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించాలని చూస్తున్న టెన్త్, డిప్లొమా, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని పరిశీలించవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
