Central Government Jobs

Railway Apprentice Jobs 2026: రైల్వేలో 2,008 అప్రెంటిస్ ఉద్యోగాలు.. 10వ తరగతి, ITIతో అవకాశం

Railway Apprentice Jobs 2026: రైల్వేలో 2,008 అప్రెంటిస్ ఉద్యోగాలు.. 10వ తరగతి, ITIతో అవకాశం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway NWR Apprentice Jobs 2026 :రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. నార్త్ వెస్టర్న్ రైల్వే (NWR), జైపూర్ పరిధిలోని వివిధ వర్క్‌షాపులు, యూనిట్లలో మొత్తం 2,008 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 7, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఖాళీలు ఉన్న ట్రేడ్లు : ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, COPA తదితర ట్రేడ్లలో అవకాశాలు ఉన్నాయి.

విద్యార్హత : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ITI అర్హతతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 2026 నవంబర్ 6 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : ఈ అప్రెంటిస్ పోస్టులకు ప్రత్యేక రాత పరీక్ష లేకుండా విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు.

దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ.100 ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు తేదీలు : ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 7న ప్రారంభమై.. నవంబర్ 6, 2026 వరకు కొనసాగుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ముఖ్యమైన లింక్ : అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్, ట్రేడ్‌ల వారీగా ఖాళీలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను నార్త్ వెస్టర్న్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *